పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : యాదవమాగధుల యుద్ధము

దివ్యరథంబులు దివ్యాయుధములు
వ్యోహగతివచ్చి రి మ్రోల నిలిచె
ప్పుడు కమలాక్షుఁ న్న నీక్షించి
“తప్పకచూడు యావకోటినెల్ల
డియఁ గాలంబన నమీఁద నాజి
డచివచ్చిరి వీరి డఁపక నుండ
నొండుపాయంబున నుడుగునే వీఁడు? 
దండిమీరిన యాయుధంబులుఁ బూను”
నవుఁడు ముసలము  లమునుఁ బుచ్చు
కొని దివ్యరథముపైఁ గొమరారె సీరి, 
రి శంఖచక్రగదాదిశార్ఞముల
రియించి కరమొప్పఁ నరథం బెక్కి
మేరుశిఖరముల మెఱుఁగులతోడ
సారమై బహువిధచ్ఛాయలఁ గలిగి
xvధారాధరము బంగిఁ నరారెఁ జూడ; 
నాలోన సృష్టిభోజాంధకాధిపులు
నేలఁ బట్టనియించి నిష్టురోక్తులను
రిఘటాబృంహితననేమిరావ
తురగఘోషితరావతూర్యముల్ మ్రోయఁ
బురికొని వెడలి యార్పులు నింగి ముట్టఁ
రవసంబునఁ దాఁకెఁ రగ సైన్యములు; 
నేలయీనిన భంగి నిగిడి “యేమేము
చాలుదు”మనివచ్చు సైనికోత్తముల.   - 530
యురుపాదహతులను నోర్వక దివికి
రిగెనొ యన ధూళి ర్కునిఁ గప్పె; 
ప్పుడు గోవిందుఁ ఖిలసైనికులు
నుప్పొంగ నిజశంఖమొత్తె, నొత్తుటయుఁ
బెదరె దిగ్గజములు, భీతిల్లెదిశలు, 
దలె కులాద్రులు, లఁగె వారిధులు
వంగె మేరువు ధరాలయంబు దిరిగె, 
క్రుంగెఁ గచ్ఛపరాజు, ఘూర్ణిల్లెనభము, 
కెరలి సేనలు పెల్లగిలి పారఁజూచె
రపరఁపరలు భీణముగా నిగిడి
రములు దునిసి యంగంబులు నాటి
శిరములు వెసఁ ద్రుంచి శిడములు నఱికి
రులు వ్రక్కలు వాపి డములు విఱచి
త్తళంబులు చించి కంఠంబు లెడపి
నెత్తురు వెడలించి నెనడులఁ గలఁచి
కండలుఁ దెగఁజెండి గాత్రంబు లడఁచి
గుండెలుఁ గూల్చి ప్రేగులు వెల్వరించి   - 540
బొమ్మిడకల్ రాల్చి బొడగలుఁ గూల్చి
యెమ్ములు నలిసేసి యెఱచులు చదిపి
పొరి వీరి వారినిఁ బోలింపరాక
బెరసె పీనుగులై పృథివియంతయూను; 
హాలికుండు నఱికిన యడవిబోలెఁ
లసి కాల్వురు చాపట్టుగాఁ బడిరి
ముందఱ బయలైన మొనసి రావుతులు
యందఱు నొక్క సాసకేళి సలిపి
తురగంబు రవుతును దునుకలై పడగఁ
రవలికత్తి నుద్ధతి మొత్తువారు
వుణి వ్రేశిన మేను వుణియై తిరిగి
తివిరి ఖడ్గములఁ దెగవ్రేయువారు
యంతళంబుల మేను లందంద పొడువ
నెత్తురు వఱ్ఱలై నెఱిఁ గూలువారు
మునిగాళ్ళు తెగి వాహములు మ్రొగ్గ సరకు
గొనక మార్తు రమని కొనునాశ్వికులును
మ్ములు తగనాట యావలవెడలి
బొమ్మలక్రియఁ గూలి పొలయు గుఱ్ఱములు
తుండంబు కొమ్మును దునియ రొఁజుచును
గొండలవలె వ్రాలు కుంజరంబులును
నొగలూడి యిరుసులు నులిసి చక్రములు
గిలి రథంబులు ప్రాణంబులెడలి.   - 550
థికులు మడిసి సాథులుర్విఁ గూలి
థములు వికలమై ణభూమి నిండె
కీలాలనదులలోఁ గీలాలకేళి
నోలలాడుచునుండు నోలిభూతములుఁ
గంకగృధ్రాదుల లకలంబులను
బింకంబుతోనాడు భేతాళములును
గొడుగులచిప్పలు గుబురులైపడిన
డగలు తుమురైన హుశస్త్రములును
నాడెడు నట్టలు తవీరవరుల
నాడకుఁ గొనిపోవు మరకామినులు
నీభంగి రణభూమి యెసఁగి చూడ్కలకు
బీభత్సరవములు బెరసి యాలోన
రభసంబున జరాసంధుఁడు తరుమ
రమంది యాదవలమోహటించి
xviవిరిసినసేనఁ గవిసి యార్చుచూను